పారిస్ ఒలింపిక్స్ లో మంగళవారం జరిగిన ఫైనల్ లో క్యూబా ప్లేయర్ యుసనీ లీస్ గుజ్మాన్ ను 5-0తో చిత్తు చేసి ఫైనల్ చేరింది వినేష్ ఫొగట్. బుధవారం వినేష్ ఫొగట్ అమెరికాకు చెందిన సారా హిండెబ్రాండ్ తో ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు ముందు ఆమె తన కేటగిరి కంటే 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండటంతో ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది.దీంతో పతకం లేకుండానే వెనుదిరగాల్సిన పరిస్తితి ఏర్పడింది.
పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేష్ పొగట్ ను డిస్ క్వాలిపై చేయడం పై తాజాగా క్రీడాశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలో ఎల్ఓసీ ఎదుట నిరసన తెలిపామన్నారు. అనర్హత పై తదుపరి చేపట్టాల్సిన చర్యల గురించి పీటీ ఉషకు ప్రధాని మోడీ సూచించారని పేర్కొన్నారు. ఫొగట్ గతంలో అనేక విజయాలు సాధించారని, ఆమెకు కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేసారు.