స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను గెలిపించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోరారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలిచిన వారు, పోటీ చేసిన అభ్యర్థులందరూ బొత్స పేరును ఏకగ్రీవంగా ప్రకటించారని.. అందరూ బొత్స గెలుపునకు అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికత విలువ పాటిస్తే.. కనుక టీడీపీ పోటీ పెట్టకూడదని అన్నారు.
జగన్ సీఎంగా ఉండి ఉంటే నైతిక విలువలు పాటిస్తూ పోటీకి పెట్టేవాళ్లమే కాదన్నారు. సంఖ్య బలం లేదని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతుందన్నారు. 380 పై చిలుకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతుందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాడని.. రాజకీయాల్లో విలువలను మరింత దిగ జారుస్తున్నాడని ఆరోపించారు జగన్.