ప్రధాని నరేంద్ర మోడీ నిన్న చైనాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలవడానికి మోడీ వెళ్లారు. అమెరికా విధించిన ప్రతికార సుంకాల నేపథ్యంలో చైనా ప్రధానితో సమావేశం కావడానికి మోడీ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రధాని చైనా భారత్ స్నేహితుడుగా కలిసి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిలలో డ్రాగన్, ఏనుగు కలిసి నడవాలని చైనా అధ్యక్షుడు ఆకాంక్షించారు.

ప్రపంచంలోనే పురాతన నాగరికత, అత్యధిక జనాభా కలిగిన దేశాలు స్నేహితులుగా ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దౌత్య సంబంధాలకు 72 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. దీర్ఘకాల, దీర్ఘకాలిక, వ్యూహాత్మక దృక్పథంతో రెండు దేశాలు ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం ఇరుదేశాలు చారిత్రక బాధ్యతలను చేపట్టాలని చైనా ప్రధాని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ చైనా దేశానికి దగ్గరవుతున్నారు. మళ్లీ ఎప్పటిలానే చైనా వస్తువుల వాడకం భారతదేశంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. చైనా యాప్ లు కూడా ఫోన్లో తొందరలోనే రానున్నట్టుగా తెలుస్తోంది.