ఏపీ మంత్రికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Join Our COmmunity

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరికి తృటిలో ప్రాణాపాయం తప్పింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రయాణిస్తున్న వాహనాన్ని కాన్వాయ్ లోని మరో వాహనం ఢీకొంది. కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్ లోని వాహనాలు  ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

అయితే ఈ ఘటనలో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ ప్రమాదం నుండి సురక్షితంగా తప్పించుకోవడం భద్రతా సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి జగన్ కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఒకరిగా కొనసాగుతున్నారు. 

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news