ఏపీ సర్కార్ మీద హైకోర్టు మరో మారు సీరియస్

Join Our COmmunity

ఏపీ ప్రభుత్వం మీద  హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. రాజధానిలో ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించడం మీద ఏపీ హైకోర్ట్ సీరియస్ అయిందని సమాచారం. అరెస్ట్ చేసేందుకు సరైన కారణాలు చూపించలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎస్సీ రైతులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రవేశపెట్టి 18 రోజులు జైల్లో ఉంచడంపై కోర్ట్ సీరియస్ అయింది.

వారి ప్రాథమిక హక్కులకు భంగం కల్గించడమే కదా అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్ట్ ధిక్కారం కింద తీసుకునే అధికారం కోర్టుకు ఉందన్న రాష్ట్ర హైకోర్టు రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకోవాలి.. ఇలా చేస్తే ప్రజలు ఎక్కడకెళ్లాలి..? అని ప్రశ్నించింది. పోలీసులు దాఖలు చేసిన రిపోర్ట్ పై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలా అయితే ‘రూల్ ఆఫ్ లా ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది ధర్మాసనం. రైతుల తరపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news