తాను అరెస్ట్‌ అవుతానని చంద్రబాబుకు ముందే తెలుసు : మంత్రి పెద్దిరెడ్డి

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో వైసిపి మంత్రులు స్పందిస్తున్నారు. తాజాగా విద్యుత్ మరియు మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ అనుభవం ఉంటే మాత్రం స్కాములు చేస్తే అరెస్టు చేయరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు తప్పని కొన్ని మీడియా సంస్థలు వాదిస్తున్నాయి అని మండిపడిన ఆయన స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 371 కోట్ల రూపాయలు నొక్కేసిన అవినీతిపరుడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. ఈ అరెస్టు చంద్రబాబు కూడా ముందే తెలుసని ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

రూ.3,356 కోట్లతో సీమన్స్ కంపెనీ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు అందులో 90శాతం సిమెన్స్ కంపెనీ భరించగా మిగిలిన 10శాతం మాత్రమే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భరిస్తున్నట్లు తెలియజేసిందన్నారు. అయితే, సిమెన్స్ కంపెనీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ప్రభుత్వం ఇచ్చిన10 శాతం అమౌంట్ రూ.370 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు చూపుతూ ఆ డబ్బు మొత్తాన్ని కూడా షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్లినట్లు ఆయన ఆరోపించారు. ఇంతటి భారీ మొత్తంలో ప్రభుత్వాన్ని మోసం చేసిన అప్పటి సీఎం చంద్రబాబుపై సీఐడీ కేసు వేస్తే తనకు అనుకూల మీడియా ద్వారా ఏదో అన్యాయం జరుగుతున్నట్లు అక్రమ అరెస్టు అంటూ గగ్గోలు పెడుతున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకి తాను తప్పు చేశానో.. లేదో తెలుసని, అయినా బుకాయిస్తున్నారని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version