ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పెద్ది రెడ్డి కుప్పంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి బహిరంగంగా అక్రమ తవ్వకాలు జరుపుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ చేపడుతున్న పెద్దిరెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ రోజు చంద్ర బాబు కుప్పంలో పర్యటించారు. కుప్పంలోని శాంతిపురంలోని బండపల్లి లో మైనింగ్ ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు.
కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ మైనింగ్ ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అక్రమ మైనింగ్ లో ఉన్నవారిని వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యవహారం పై జాతీయ స్థాయిలో పోరాడటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను అనుమతులు లేకుండా దోచుకోవడం పై తాను కేంద్ర అటవీ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానని అన్నారు.