తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కొత్త చిక్కులు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు చిక్కులు వచ్చి పడ్డాయి. మాస్ కాపీయింగ్ చేస్తూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ్ముడి కుమారుడు పొన్నం సాత్విక్… అడ్డంగా దొరికిపోయాడు. దీంతో శాతవాహన యూనివర్సిటీ నుంచి డిబార్ చేశారు.

అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే, కుటుంబ సభ్యులకు పొన్నం సాత్విక్ సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే శాతవాహన యూనివర్సిటీకి వెళ్లి కాంగ్రెస్ శ్రేణులు గొడవలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ్ముడి కొడుకు పొన్నం సాత్విక్
శాతవాహన యూనివర్సిటీ నుండి డిబార్
యూనివర్సిటీకి వెళ్లి గొడవ చేసిన కాంగ్రెస్ శ్రేణులు pic.twitter.com/gzrpn8ooxS
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2025