తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలిచారని బాంబు పేల్చారు మహేష్ కుమార్ గౌడ్. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారనే అనుమానం ఉందని ఆరోపణలు చేశారు.

పని చేసి ఓట్లు అడగడం దమ్మున్న నాయకుడి లక్షణం అన్నారు. కానీ కులం పేరుతో, దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీ వాళ్లు అని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. మా ప్రభుత్వం ఇప్పటి వరకు 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది అని పేర్కొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.