మంత్రి ఆర్కే రోజా భర్త సెల్వమణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఇటు రోజా, అటు సెల్వమణి ఇద్దరిదీ సినీ నేపథ్యం. సినిమాల గురించి పూర్తి అవగాహన ఉన్న దిగ్గజాలు వీరిద్దరూ. కాబట్టి ఆ రంగాలకు సంబంధించి చేసే వ్యాఖ్యలపై అచితూచి వ్యవహరించకపోతే ఆ ప్రభావం వేరేలా ఉంటుంది. తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఉన్న సెల్వమని తాజాగా ఆ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా చెన్నైలో జరిగిన సిఐఐ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళ సినిమాలు తమిళనాడులోనే షూటింగ్ చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సెల్వమణి. ఇతర ప్రాంతాలలో షూటింగ్ చేయడం వల్ల కోలీవుడ్ కార్మికులు చాలా నష్టపోతున్నారని చెప్పారు. కొన్ని సినిమాలు పూర్తిగా తమిళనాడు బయటే చిత్రీకరిస్తున్నారని అన్నారు. దీనివల్ల తమిళ ఇండస్ట్రీ నష్టపోతుందని చెప్పుకొచ్చారు.