రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్షపై స్పందించిన మంత్రి రోజా

-

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన దిశ చట్టం స్ఫూర్తితోనే రమ్య హత్య కేసు లో నిందితుడు శశి కృష్ణ కు ఉరిశిక్ష పడిందని మంత్రి ఆర్ కే రోజా తెలిపారు.బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశి కృష్ణ కు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని మంత్రి రోజా స్వాగతించారు.ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.ఉరిశిక్ష ఖరారు చేసిన గుంటూరు కోర్టు న్యాయవాది కి ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.దిశ చట్టం స్ఫూర్తితో హత్య జరిగిన పది గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం, ఐదు రోజుల్లోనే చార్జిషీటు వేసి త్వరితగతిన విచారణ జరిగేలా దిశ ప్రత్యేక న్యాయవాది తో కేసు విచారణ చేపట్టి.8 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష వేయడం సీఎం వైఎస్ జగన్ పరిపాలన గొప్పతనం అని చెప్పారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు గుంటూరు లోని పరమయ్య కుంట వద్ద గత ఏడాది ఆగస్టు 15న హత్య జరగగా ఏడాదిలోగానే విచారణ పూర్తయింది.రమ్యను కత్తితో పొడిచి హత్య చేసిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.రమ్య శరీరంపై 8 కత్తి పోట్లను వైద్యులు గుర్తించారు.ఈ కేసులో మొత్తం 36 మంది సాక్షులను విచారించి నిందితుడికి ఉరిశిక్ష విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version