మంత్రి శ్రీధర్ బాబు పట్టించుకోవడం లేదని.. పురుగుల మందు తాగిన మాజీ సర్పంచ్

-

మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు పట్టించుకోవడం లేదని మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త అందె సత్యనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

శ్రీపాద రావు దగ్గరి నుండి శ్రీధర్ బాబు వరకు ఇన్నేండ్లు కష్టపడి గెలిపించిన వారిని పక్కన పెట్టి పక్క పార్టీ నుండి వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని మంథని నియోజకవర్గం కాటారం మండలం విలాసాగర్ గ్రామ మాజీ సర్పంచ్ అందె సత్యనారాయణ ఆరోపించారు.శ్రీపాద రావు దగ్గరి నుండి శ్రీధర్ బాబు వరకు ఆ కుటుంబాన్ని నమ్ముకొని, వాళ్ళ కోసం కష్టపడితే.. ఇప్పుడు శ్రీధర్ బాబు వేరే వాళ్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు.పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక చాలా మంది గుంట నక్కలు పార్టీలోకి వచ్చారని మంత్రి కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నాడని ఆవేదన వెళ్లగక్కాడు.మమ్మల్ని పట్టించుకోకపోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని అందుకే పురుగుల మందు తాగుతున్నట్లు పేర్కొన్నాడు. గమనించిన కుటుంబసభ్యులు సత్యనారాయణను వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news