ఓ ఇంటివాడైన టాలీవుడ్ యువ హీరో నితిన్..!

-

టాలీవుడ్ యువ హీరో నితిన్ ఓ ఇంటివాడయ్యాడు. ఇవాళ హైదరాబాదులో నితిన్, షాలినిల వివాహం వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయనేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి తెలంగాణ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబందించిన పోటోలను మంత్రి శ్రీనివాస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

నితిన్‌-షాలిని కుటుంబ‌స‌భ్యుల‌తోపాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు వేడుక‌కు హాజ‌రై..నూత‌న వ‌ధూవ‌రుల‌కు త‌మ ఆశీర్వ‌చ‌నాలు అందించారు. నితిన్, షాలిని నవదంపతులు సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ధగధగమెరిసిపోయారు. పక్కా హిందూ సంప్రదాయ పద్దతిలో వేద పండితుల వేద మంత్రాల నడుమ నిర్ణయించిన సుముహుర్దానికే నితిన్ షాలిని మెడలో మూడు మూళ్లు వేశారు. దాంతో నితిన్, షాలిని ఒక్కటయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version