Work life balance: జాబ్ ని జీవితాన్ని బ్యాలన్స్ చేయలేకపోతున్నారా..? ఈ టిప్స్ పాటించండి

-

అటు జాబ్‍ని ఇటు జీవితాన్ని మేనేజ్ చేయడం ఈ మధ్యకాలంలో కష్టంగా మారిపోయింది. దీనివల్ల మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. జీవితంలోకి జాబ్ టెన్షన్స్ వచ్చేసి సరిగ్గా జీవించలేకపోతున్నారు. మీరు కూడా వర్క్ ని లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేకపోతే ఈ టిప్స్ పాటించండి.

బౌండరీస్ ఉండాలి:

పనిచేస్తున్నప్పుడు ఇంటి విషయాలు ఆలోచించకూడదు, ఇతరులతో చర్చించకూడదు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత జాబ్ విషయాలను పక్కన పెట్టాలి. మెయిల్స్ చెక్ చేయకూడదు. ఈ విషయంలో కఠినంగా ఉండాలి.

నో చెప్పడం నేర్చుకోవాలి:

ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ పనికి సంబంధించి ఏదైనా కాల్ వస్తే నేను చేయలేను అని చెప్పే కెపాసిటీ మీకు ఉండాలి. లేదంటే ఇబ్బంది పడతారు. మొహమాటానికి పోతే అనవసరంగా మానసిక ఒత్తిడి కలుగుతుంది.

అప్పుడప్పుడు ఆఫీస్ మానేయాలి:

అవును.. అస్తమానం పని పని అని తిరగకుండా అప్పుడప్పుడు ఆఫీస్ మానేసి సరదాగా పిక్నిక్ వెళ్లాలి. దీనివల్ల మూడ్ రిఫ్రెష్ అవుతుంది. కొత్తగా శరీరంలోకి శక్తి వస్తుంది. దీనివల్ల పనిచేసే సామర్థ్యం ఇంకా పెరుగుతుంది.

సోషల్ మీడియా అసలే వద్దు:

పని వేళల్లో సోషల్ మీడియాకు దగ్గరై పనికి దూరం కావద్దు. మిమ్మల్ని పక్కదోవ పట్టించే విషయాల మీద దృష్టి పెట్టకపోతే బాగుంటుంది. దీనికోసం సోషల్ మీడియాకు ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించండి.

చిన్నచిన్న బ్రేక్స్ కావాలి:

ఒకసారి వర్క్ మీద కూర్చుంటే అదే పనిగా చేస్తూ పోవడం మంచిది కాదు. కనీసం అరగంటకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. కాస్త రెండు నిమిషాలు అలా నడిచి మళ్ళీ వర్క్ మీదకు వెళ్లాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version