ఖమ్మం డ్రైనేజీ కి రెండు వేల కోట్లు ఇవ్వమని ముఖ్యమంత్రిని కోరాను అని మంత్రి తుమ్మల అన్నారు. ప్రజల సంపాదన అంతా ఆసుపత్రులకే ఖర్చు అవుతుంది. దేశంలో అత్యధికంగా పట్టణీకరణ జరిగిన రాష్ట్రం తెలంగాణ. కొంతకాలం ఖమ్మంలో ప్రశాంతత కు భంగం కలిగింది. ఎవ్వరూ దౌర్జన్యం చేసిన సహించేది లేదు. ఆక్రమణలు ఫోర్స్ ఫుల్ గా తీసివేస్తాం. అనాలోచితంగా అభివృద్ధి చేస్తే ప్రజలు మెచ్చరు.
ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతడం సరికాదు. ఆక్రమించుకోవడం తప్పు. ఆక్రమించుకున్న వారికి మంచినీళ్లు, కరెంట్ ఇవ్వడం తప్పు. కార్పొరేటర్ లు పాత ప్రభుత్వంలో ఇలాగే చేశాం అంటే కుదరదు. లా అండ్ ఆర్డర్ బాగా వుంటే ప్రశాంతత వుంటే అభివృద్ధి సాగుతోంది. పోలీసులు ఎక్కడ రాజీ పడవద్దు. ఆక్రమణలు వుంటే వాటిని తొలగించండి. పెద్దవాళ్ళు వుంటే వారికి సహకరించండి. పని చేసే అధికారులను ఇబ్బంది పెట్టితే మళ్ళీ ఖమ్మం కు కష్టాలు తెచ్చిన వారు అవుతాం. రోడ్లు, నాళాలు ఆక్రమించుకుని కట్టడాలు కడితే ప్రజలే నష్టపోతారు అని మంత్రి తుమ్మల అన్నారు.