బనకచర్ల ప్రాజెక్టును మేము వ్యతిరేకిస్తున్నాం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం కూలిపోతే బిఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పలేదు. కృష్ణా నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగింది. బీఆర్ ఎస్ వైఫల్యం వల్లనే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ కు నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఐఏఎస్ అధికారుల పట్ల బీఆర్ఎస్ చిల్లరగా మాట్లాడొద్దు. ఐఏఎస్ అధికారులు ఎక్కడ ఉంటే అందుకు తగిన విధంగా పని చేస్తారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చెబితే బ్యూరోక్రాట్స్ వాటిని అమలు చేయాలని ర్యాజ్యాంగం చెబుతోంది అని అన్నారు.
ఇక 2017లో ముచ్చుమర్రి ప్రాజెక్టులో 6300క్యూసెక్కులకు పెంచుకోవడానికి మాకు అభ్యంతరం లేదని తెలంగాణ మంత్రి అన్నారు. 2020లో ఏపీ జీవో 203 రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 34 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోతాం అని చెబితే నాటి ముఖ్యమంత్రి ఏమి మాట్లాడాలేదు. అప్పుడు జగన్, కేసీఆర్ ఇద్దరు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటు ఉన్నారు. 2020లో ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గోదావరి, కృష్ణా నీటిని తీసుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ వాటిని పట్టించుకోలేదు. తెలంగాణ రాక ముందు 44 వేల క్యూసెక్కులు తీసుకుపోతే.. తెలంగాణ వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా 92600 వేల క్యూసెక్కుల నీటిని తీసుకుపోయారు. గతంలో కంటే hnss, మచ్చుమర్రి ద్వారా ఎక్కువ నీటిని తరలించుకుపోయారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఉంటే ప్రతీ రోజు 4.1టీఎంసీలు తెలంగాణ రాకముందు డ్రా చేస్తే.. తెలంగాణ వచ్చిన తరువాత 9.6 టీఎంసీకి పెరిగింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం 30.07.2020లో జరగాల్సి ఉంటే 10.08.2020 టెండర్లలో ఏపీకి ఇబ్బంది కలుగకుండా ఉండేందు కోసం పోస్టు ఫోన్ చేయించింది కేసీఆర్ ప్రభుత్వం అని ఉత్తమ్ పేర్కొన్నారు.