మేడ్చల్ మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు బై పాస్ అండర్ బ్రిడ్జి కింద వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆ వివాహితను బండరాళ్లతో కొట్టి మొకంపై పెట్రోల్ పోసి తలగబెట్టారు గుర్తు తెలియని దుండగులు. దిశ కేసు తరహాలో మేడ్చల్ ఓఅర్ఆర్ బ్రిడ్జి కల్వర్టు కింద హత్య చేసి తగలబెట్టారు దుండగులు. అయితే వివాహితపై అత్యాచారం జరిపి హత్య చేశారా అనేది తెలియడానికి కీలకంగా మారింది పోస్ట్ మార్టం నివేదిక.
అయితే ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నాయి పోలీసుల క్లూస్ టీం. 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ పోలీసులు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు. ఇక పెట్రోల్ పోసి తగలబెట్టడం వల్ల మొహం మొత్తం కాలిపోయి.. గుర్తుపట్టకుండా ఉంది. ఆమె చేతి పై శ్రీకాంత్ అని తెలుగులో.. నరేందర్ అని ఇంగ్లీష్ లో టాటూ ఉన్నట్లు తెలుస్తుంది.