లోకేష్ గత కొద్దికాలంగా మంచి పాయింట్ మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు. వైసీపీని ఇరుకున పెట్టేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడ ఆయన పది, ఇంటర్ పరీక్షలపై తగ్గపోరు నడిపిస్తున్నారు. ఆయన విమర్శలపై జగన్ పెద్దగా స్పందించకపోయినా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాత్రం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఈ పంచాయితీ లోకేష్ వర్సెష్ మంత్రి అన్నట్టు తయారైంది.
మిగతా రాష్ట్రాల్లో చేసినట్టే ఏపీలోనూ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలంటూ లోకేష్ పట్టుపడుతున్నారు. అయితే దీనిపై మంత్రి స్పందిస్తూ ఇతర రాష్ట్రాలను లోకేష్ చూస్తున్నారని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను కూడా గమనించాలని కోరారు.
దాదాపు 15 రాష్ట్రాల్లో ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ రద్దు చేయగా ఏపీలో ఎందుకు చేయట్లేదంటూ లోకేష్ బాగానే ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ ఫీజులు కట్టి విదేశాల్లో చదువుకునే స్థోమత పేద స్టూడెంట్లకు లేదని, అందుకే వారు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందనే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందిన మంత్రి చెబుతున్నారు. ఇక దీనిపై లోకేష్ స్పందిస్తూ తాము దీనిపై న్యాయపోరాటం చేస్తామంటూ చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.