టీఎస్ పీజీఈసెట్-2024 రాత పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

-

టీఎస్ పీజీఈసెట్-2024 రాత పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఏ అరుణ కుమారి శుక్రవారం వెల్లడించారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల నేపథ్యంలో టీఎస్ పీజీఈసెట్ రాత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు జరగాల్సిన పీజీఈసెట్ రాతపరీక్షలను జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ స్వల్ప మార్పును గమనించాలని కన్వీనర్ విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news