లవ్ టెర్రర్ : ప్రేమించలేదని బాలికని 32 సార్లు పొడిచిన ప్రేమోన్మాది !

-

ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు, తన ప్రేమను తిరస్కరించింది అనే కోపంతో 16 ఏళ్ల బాలికను 23 ఏళ్ల యువకుడు 32 సార్లు పొడిచి మరీ చంపాడు. గుజరాత్‌లోని జెటల్‌సార్ ప్రాంతంలో తన ప్రేమను కదాన్నదని కోపంతో 16 ఏళ్ల బాలికను 23 ఏళ్ల యువకుడు పొడిచి చంపాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని జయేష్ సర్వైయా గా గుర్తించారు. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే మార్చి 17 న గుజరాత్ రాజ్‌కోట్‌లోని జెట్‌పూర్ తాలూకాలోని జేతల్సర్ గ్రామంలోని 12 వ తరగతి విద్యార్థిని తన సోదరుడితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించడంతో బాధితురాలిని ఇంటి నుంచి బయటకు లాగి 32 సార్లు కత్తితో పొడిచి చంపారు.

తన సోదరిని కాపాడటానికి ప్రయత్నించిన సమయంలో ఆమె సోదరుడి మీద కూడా నిందితుడు 4-5 సార్లు పొడవడంతో సోదరుడికి కూడా గాయాలయ్యాయి. బాధితురాలి తండ్రి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  ఇదిలావుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సి ఆర్ పాటిల్ సోమవారం బాధితురాలి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు అలానే ఈ కేసులో దోషులను శిక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్, ఎన్‌సిపి నాయకుడు రేష్మా పటేల్ కూడా కుటుంబ సభ్యులను కలుసుకుని తమ సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version