కలెక్షన్లలో దుమ్ము రేపుతున్న మిరాయ్…ఎన్ని కోట్లంటే!

-

 

తేజ సజ్జ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ సినిమా మిరాయ్. ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. మిరాయ్ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 55.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు.

Mirai Moive Review
Mirai is raising dust in the collections

మరోవైపు వీకెండ్ కావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు మరింతగా పెరుగుతాయని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన హీరోయిన్ గా రితిక నాయర్ నటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ కీలకపాత్రను అందించారు. సినిమాలో తన నటనతో కనిపించకపోయినా వాయిస్ అందించి సినిమాను ఎక్కడికో తీసుకువెళ్లారు. ప్రభాస్ వాయిస్ అయితే సినిమాకు బాగుంటుందని భావించి చిత్ర యూనిట్ సభ్యులు అతడిని అడగగానే వెంటనే ఓకే చెప్పారట. దీంతో ప్రభాస్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news