హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన.. దంచికొడతోంది. ఇప్పటి వరకు నమోదైన వర్షపాత వివరాలు పరిశీలిస్తే.. మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 5.53 సె.మీ నమోదు అయిం ది. నేరె డ్ మెట్ లో 5 సె.మీ, బండ్లగూడలో 4.75 సె.మీ, మల్లాపూర్ లో 4.2 సె.మీ, నాచారంలో 4.13 సె.మీ, ఉప్పల్ చిలకానగర్ లో 3.85 సె.మీ, కాప్రాలో 3.7 సె.మీ నమోదు అయింది.

ఇక అటు గుంటూరు నగరంలో క్లౌడ్ బరస్ట్ తరహా వర్షం విపరీతంగా కురుస్తోంది. కేవలం 25 నిమిషాల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు అయింది. దీంతో గుంటూరు నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. గుంటూరులో మరో గంట పాటు ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు ఎట్టి పరిస్థితులలో ఇంట్లో నుంచి బయటకు రాకూడదని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అమరావతి, సత్తెనపల్లి, విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి.