రూ. 100 కోట్ల క్ల‌బ్ లో “మిరాయ్” ..!

-

తేజ సజ్జా హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “మిరాయ్”. ఈ సినిమా విడుదలైన మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్ల వద్ద “మిరాయ్” సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తేజ సజ్జా సరసన హీరోయిన్ గా రితిక నాయర్ నటించింది. మంచు మనోజ్ విలన్ పాత్రను పోషించారు. ప్రభాస్ ఈ సినిమాకు వాయిస్ అందించారు కాగా, ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రూ. 100 కోట్ల కలెక్షన్ల దిశగా “మిరాయ్” సినిమా దూసుకెళ్తోంది.

mirai
mirai

విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 91.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా సినీ యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. మొదటి మూడు రోజుల్లో రూ. 81.2 కోట్లు, నిన్న రూ. 10.25 కోట్లు రాబట్టడం విశేషం. కాగా ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, శ్రియా కీలకపాత్రలను పోషించారు. ఇక ఈ సినిమా మరిన్ని కలెక్షన్లను అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఈ సినిమాతో తేజ సజ్జ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగి పోయిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో తేజ సజ్జాతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news