మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన యూరియాను బ్లాక్‌లో అమ్మి అడ్డంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్‌మెన్ దొరికారని వార్తలు వస్తున్నాయి. లారీ యూరియా లోడ్‌ను బ్లాక్‌లో అమ్మేశాడట మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్.

వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పీఏ అంటూ, లారీ లోడ్ యూరియాను బ్లాక్‌లో అమ్మేశాడట గన్‌మెన్ నాగు నాయక్. ఇక ఈ విషయం తెలియగానే రైతులు ఆగ్రహించారు. మాకు యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు యూరియా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని గన్‌మెన్‌పై విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.