ఢిల్లీలో తీవ్ర విషాదం చోఓటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి నవజోత్ మృతి చెందాడు. ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
తన భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా.. వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది ఓ BMW వాహనం. బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నవజోత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు.
భార్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు.. BMW వాహనంలో ప్రయాణిస్తున్న జంటకు కూడా ఈ ఘటనలో గాయాలు అయినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.