భాతర అమ్ముల పొదలోకి మరో మిస్సైల్ వచ్చి చేరింది. ఆశించినట్లుగానే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ పృథ్వీ-2 పరీక్ష సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఒడిశాలోని బాలాసోర్లోని ఐటీఆర్ లాంచింగ్ కాంప్లెక్స్-3 నుంచి బుధవారం రాత్రి 7గంటల 40నిమిషాలకు చేసిన ప్రయోగం సక్సెస్ అయినట్లు వెల్లడించింది రక్షణ మంత్రిత్వ శాఖ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతోనే ఢీకొట్టిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష జరిపిన సమయంలో మిస్సైల్ అన్ని క్వాలిటీ పారామీటర్స్ తోనే ఉందని పేర్కొంది రక్షణ మంత్రిత్వ శాఖ. ఇదే క్షిపణిని 2018 ఫిబ్రవరి 21 నైట్ టైంలో ఛండీపూర్ లోని ఐటీఆర్ వద్ద, గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా రాత్రి సమయాల్లో ప్రయోగించారు.