బెంగాల్‌లో మిస్సింగ్ విశాఖలో ప్రత్యక్షం..ఏకంగా 26 ఏళ్ల తర్వాత!

-

పశ్చిమ బెంగాల్‌కు చెందిన గుర్తుతెలియని ఓ వ్యక్తి ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చేశాడు. అక్కడ కనిపించకపోయాడని ఇంట్లో వారు మిస్సింగ్ కేసు పెట్టారు. తీరా చూస్తే అతను ఏపీలోని విశాఖలో ప్రత్యక్షం అయ్యాడు.26 ఏళ్లుగా రోడ్ల మీద జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చొరవ కారణంగా ఆ వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకున్నారు. వివరాల్లోకివెళితే.. బెంగాల్‌కు చెందిన బిశ్వజిత్ (50)విశాఖలో రోడ్ల మీద మానసిక పరిస్థితి బాగాలేక తిరుగుతుండగా.. మాజీ ఐఏఎస్ శర్మ ఆయన్ను మూడు నెలల క్రితం విశాఖలో అనాధ ఆశ్రమాలు నడుపుతున్న ఏయూటీడీ సెక్రటరీ ప్రగడ వాసుకు ఫోన్ చేసి అతన్ని అందులో చేర్పించారు.

తీరా అతని గురించి వాకబు చేయగా.. ఇతని పేరు మీద మిస్సింగ్ కేసు నమోదై ఉంది. దీంతో డ్యూటీ డాక్టర్ రాకేష్ పేషెంట్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి సోదరుడు బాంగ్సీ బదన్ కుటుంబంతో సహా వెంటనే వైజాగ్ ఆసుపత్రికి చేరుకున్నారు.తను ఇచ్చిన సమాచారం మేరకు వారిది బెంగాల్ బాంకుర జిల్లాలోని మదన్ మోహన్ పూర్ గ్రామం. తమ సోదరుడి కోసం చాలా కాలం వెతికామని, ఇన్నాళ్లకు దొరికినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news