SBI స్పెషల్ స్కీమ్.. ఈజీగా రూ.35 లక్షల లోన్.. పూర్తి వివరాలివే..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం అనేక రకాల సేవలని అందిస్తోంది. ఎప్పటికప్పుడు లోన్లు కూడా ఇస్తూ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త స్కీమ్స్ ని కూడా ప్రవేశ పెడుతోంది. మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం సాధారణమే. బ్యాంకులు రుణాలు మంజూరు చేసేటప్పుడు పలు అంశాలని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. నెలవారి ఆదాయం ఉన్నవారికి వేగంగా రుణాలు ఇస్తుంటాయి. వడ్డీ రేట్లలోనూ రాయితీ కల్పిస్తూ ఉంటాయి. క్రమంలో దేశంలోని అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంకు సరికొత్త స్కీముని తీసుకువచ్చింది. లక్ష పై నెలవారీ ఆదాయం కలిగి ఉన్నట్లయితే హై వాల్యూ శాలరీ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన పర్సనల్ లోన్ స్కీముని తీసుకొచ్చింది.

sbi

పెళ్లిళ్లు, షాపింగ్ ఇలా దేనికైనా వీటిని వాడుకోవచ్చు. తక్కువ డాక్యుమెంటేషన్ ద్వారా లోన్స్ అందించేందుకు SBI ఎక్స్ప్రెస్ ఎలైట్ పర్సనల్ లోన్స్ తీసుకురావడం జరిగింది. గరిష్టంగా 35 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేట్లు తక్కువ డాక్యుమెంటేషన్ తోనే రుణాన్ని పొందవచ్చు. ఈ స్కీము ద్వారా లోన్ తీసుకోవాలనుకుంటే కచ్చితంగా SBI లో శాలరీ ఎకౌంటు ఉండాలి. నెలకు కనీసం లక్ష సంపాదించాలి.

ఈఎంఐ లేదా ఎన్ఎంఐ రేషియో 65% గా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర సాహిత్య దళాలు, కోస్ట్ గార్డు ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వాళ్లు తో పాటుగా కొంత మందికి లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అసలు లోన్ అమౌంట్ మూడు లక్షలు ఉండగా.. గరిష్టంగా 35 లక్షలు ఉంది. వడ్డీ రేట్లు 11.45% నుంచి 12.95% గా ఉంటాయి రక్షణ రంగానికి చెందిన వాళ్ళకి 100% ప్రీ పేమెంట్ చార్జీలు మాఫీ ఉంటాయి. లోన్ మంజూరైన 6 నెలల తర్వాత పేమెంట్ చేసిన వారికి వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news