హైదరాబాద్ లో దారుణం.. మియాపూర్ లో అదృశ్యమైన యువతి మృతి

-

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులు చూసుకోవాలని.. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని.. మద్యానికి, డ్రగ్స్ కి అలవాటు పడకూడదని ప్రభుత్వాలు సూచించినప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. చెడు వ్యసనాలకు బానిసై చెడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువత కామాంధులుగా మారుతున్నారు. ప్రేమ లేదా పెళ్లి నెపంతో అమాయకులైన ఆడపిల్లల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని మియాపూర్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈనెల 08న యువతి  అదృశ్యమైందని తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తుక్కుగూడ లోని చెట్ల పొదల్లో 18 ఏళ్ల యువతి మృత దేహం లభ్యమైంది. ఆ యువతికి ఉప్పుగూడకు చెందిన యువకుడితో ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. అయితే ఆ యువకుడిని పెల్లి కూడా చేసుకున్నట్టు ఫొటోలు దర్శనమిచ్చాయి. ఆ యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి మృతి పై విచారణ చేపడుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version