కోవాగ్జిన్, కోవిషీల్డ్ కలిపి ఇవ్వడం వలన మెరుగైన ఫలితాలు: ICMR స్టడీ

-

కరోనా మహమ్మారి వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అయితే వ్యాక్సిన్ కూడా ఇప్పటికే ఎంతో మంది వేయించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల వ్యాక్సిన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఐసీఎంఆర్ చేసిన స్టడీ ప్రకారం కోవాగ్జిన్, కోవిషీల్డ్ కలిపి ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి అని చెబుతోంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన స్టడీ ప్రకారం చూస్తే.. రెండు వ్యాక్సిన్స్ కలిపి ఇవ్వడం వల్ల చక్కటి ఫలితాలు కనబడుతున్నాయి అని తెలుస్తోంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవి షీల్డ్ భారత దేశంలో చాలా మంది వేయించుకున్నారు.

అయితే ఈ రెండూ బాగా పని చేస్తున్నప్పటికీ ఈ రెండిటినీ కలిపి ఇవ్వడం వల్ల మరింత బాగుందని ఐసీఎంఆర్ చెప్పింది. డెల్టా ప్లస్ వేరియంట్ కి వ్యతిరేకంగా ఇది బాగా పని చేస్తుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల సురక్షితంగా ఉండడమే కాకుండా మెరుగైన ఇమ్మ్యూనోజెన్సిటీని కూడా ఇస్తుందని అధ్యయనం ద్వారా తెలుస్తోంది. సింగల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ Emergency Use Authorization in India (EUA) కోసం ఆమోదం పొందిన ఒకరోజు తర్వాత ఇది అభివృద్ధి చేయడం జరిగింది.

శుక్రవారం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్ల మరియు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమావేశమయ్యారు. దీనిలో కోవిషీల్డ్ సరఫరా గురించి చర్చించడానికి మరియు భారతదేశంలో ఉత్పత్తిని పెంచడానికి ఈ సమావేశం జరిగింది. అయితే కోవిషీల్డ్ ఉత్పత్తిలో ప్రభుత్వం మద్దతు ఇస్తుంది అని మంత్రి మాండవ్య అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version