మిజోరాంలో మరోసారి భూకంపం… రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రత

-

మరోసారి ఈశాన్య రాష్ట్రం భూకంపంతో వణికింది. తాజాగా మిజోరాంలో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామును భూకంపం వచ్చింది. భూకంప తీవ్రతో మిజోరాం చంఫై లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత తో భూకంపం సంభవించింది. చంఫైకి 56 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర కేంద్రీక్రుతం అయిందని .. సెంటర్ ఫర్ సెస్మీలజీ వెల్లడించింది. ఇటీవల కాలంలో తరుచుగా మిజోరాంలో వరస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈనెల 11న, గత నెల 29న కూడా ఇలాగే భూకంపాలు సంభవించాయి. గత శనివారం రాజధాని ఐజ్వాల్ కు సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 3.7 తీవ్రతతో భూమి కంపించింది.

మిజోరామే కాకుండా మేఘాలయలో తరుచు భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు అస్సాం, హిమాలయ రీజియన్ ప్రాంతాల్లో, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపాలు సంభవించాయి. అయితే ఇవన్నీ తక్కువ తీవ్రతతో  రావడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించడం లేదు. సగటున 4 తీవ్రత కన్నా తక్కువ తీవ్రతతోనే భూకంపాలు వస్తుండటంతో పెద్దగా నష్టం ఏర్పడలేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version