ఇండియాలో 87కు చేరిన ఓమిక్రాన్ కేసులు..

-

దేశంలో ఓమిక్రాన్ కల్లోలం కలిగిస్తుంది. రోజురోజుకు ఓమిక్రాన్ తీవ్రత ఇండియాలో పెరుగుతోంది. కొత్త రాష్ట్రాలకు విస్తరిస్తూ.. కేసుల సంఖ్య పెంచుకుంటోంది. తాజాగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా కర్ణాటకలో 5, తెలంగాణలో 4, గుజరాతలో ఒక కేసు నమోదు కావడంతో దేశంలో మొత్తంగా 87 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వేగంగా కరోనా వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య 7కు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఓమిక్రాన్ బాధితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

దేశంలో ఇప్పటి వరకు దేశంలో మహారాష్ట్రలో 32 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా… రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 10, కర్ణాటకలో 8, తెలంగాణలో 7, కేరళలో 5, గుజరాత్ లో 5, తమిళనాడు, ఏపీ, చంఢీగడ్, వెస్ట్ బెంగాల్ లలో ఒక్కో ఓమిక్రాన్ కేసు నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో నమోదైన కేసులన్నీ.. విదేశాల నుంచి వచ్చిన వారికే వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version