మార్చిలో తిరుపతి బస్టాండ్ పునర్నిర్మాణానికి టెండర్లు..!

-

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో తిరుపతి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం అని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 15 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు వేగవంతం చేశాం. తుడా, స్మార్ట్ సిటీ నిధులతో నూతన రోడ్లు, గుంతలమయమైన రోడ్లను పూడ్చడం, మురికికాలువల నిర్మాణం, పార్కులను అభివృద్ధి చేశాం. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించాం. కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యులైన వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. తిరుమలలో గత ఐదేళ్ళలో తట్టల పేరుతో అనధికారికంగా వ్యాపారాలు జరిగాయి. నారాయణ అనే వ్యక్తి తిరుమలలో ఇష్టానుసారం వ్యవహరించాడు. అక్రమార్కులు, శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేసిన వారెవరినీ వదిలిపెట్టలేదు. నగరంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

గత ప్రభుత్వంలో నగరంలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టవేశాం. నా పేరు చెప్పి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఉపేక్షించేది లేదు. తిరుపతిని ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలోనే ఉంచుతాం. టిడిఆర్ బాండ్లను త్వరలోనే బాధితులకు అందజేస్తాం. టిడిఆర్ బాండ్ల పేరుతో కోట్ల రూపాయలు వైసిపి నేతలు దేచేశారన్నది వాస్తవం. టిడిఆర్ బాండ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణ జరుగుతోంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ను త్వరలోనే పునర్నిర్మిస్తాం. మార్చినెలలో ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం. నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణం వేగంగా జరుగుతోంది..త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. జగనన్న కాలనీ బాధితులకు న్యాయం చేస్తాం.. అర్హులైన వారికి వేరే ప్రాంతంలో ఇంటిని నిర్మించి ఇస్తాం. సంక్షేమం, అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగిస్తాం. సీఎం చంద్రబాబు సారథ్యంలో అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news