తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను, మంత్రులను, ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్టు తిడితే కొట్టడమే కరెక్ట్ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మెన్ బాజి రెడ్డి గోవర్థన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మండి పడ్డారు. ఎంపీ ధర్మపూరి అరవింద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దాని ఫలితమే ఆర్మూర్ దాడి అని అన్నారు. గన్నరంలోనే దాడి జరగాల్సిందని అన్నారు.
అక్కడ మిస్ అయినా.. ఆర్మూర్ లో దాడి జరిగిందని అన్నారు. బీజేపీ నాయకులు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రిపై, మంత్రులపై, ఎమ్మెల్యేపై నోటి ఎంత వస్తే.. అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక నుంచి సహించమని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులను తిడితే.. ఎదురు తిరగండి.. ఎక్కడికక్కడి అడ్డుకొండని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగ ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా పెను దుమారం అవుతున్నాయి.