నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి వచ్చేనెల 17న జరగనున్న ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారంలో మునిగాయి. నిన్న జానారెడ్డి కొన్ని ఛాలెంజ్ లు చేశారు. ఈ అంశం మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, జానారెడ్డి ఔట్ డేట్ అయ్యారని, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచు పెట్టుకొని పోయిందని అన్నారు. జానారెడ్డి గతం టీఆర్ఎస్ భవిష్యత్తు అని బాల్క సుమన్ అన్నారు.
ఓటమి భయంతో జానారెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందన్న ఆయన నిన్నటి సభలో జానారెడ్డి మాటలు ఓటమిని ఒప్పుకున్నట్లు ఉన్నాయని అన్నారు. జానారెడ్డి ఏనాడు సామాన్య ప్రజలు పట్టించు కోలేదని, చాలా మంది ప్రజలు ఇప్పటికి జానారెడ్డిని సరిగా చూడలేదు…. జానారెడ్డిది రాచరిక పాలన అని అన్నారు. ఆయన ఎన్నడూ సామాన్య ప్రజలను పట్టించుకోలేదని బాల్క సుమన్ ఆరోపించారు. బిజెపికి ఓటేస్తే నాగార్జున సాగర్ నీటిని మనకే అమ్ముతారని ఆయన చురకలంటించారు.