పటాన్ చెరు కాంగ్రెస్ నాయకుల మధ్య టెన్షన్..!

-

పటాన్ చెరులో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ లుగా విడిపోయారు పార్టీ నేతలు. కాసేపట్లో పటాన్ చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకుల ధర్నా మొదలు కానుంది. మరో వైపు అమీన్ పూర్ లో పోలీసుల బందోబస్తు మధ్య అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. దాంతో పటాన్ చెరు వద్ద డీఎస్పీ, ఆరుగురు సీఐలతో సహా భారీగా మోహరించారు పోలీసులు.

పటాన్ చెరు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ధర్నాకు సిద్దమవుతున్నారు కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. పటాన్ చెరు బస్టాండ్ వద్ద NH 65 పై భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో తనతో పాటు చేరిన BRS నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారిని పట్టించుకోవడం లేదని.. గతంలో తమపై కేసులు పెట్టిన పోలీసులకే పోస్టింగ్ లు ఎమ్మెల్యే ఇప్పుస్తున్నారని వాదిస్తున్నారు పాత కాంగ్రెస్ నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news