7, 8, 9 తేదీల్లో నెక్లెస్ రోడ్ లో ప్రజా ఉత్సవాలు – సీఎం రేవంత్‌

-

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 7, 8, 9 తేదీల్లో నెక్లెస్ రోడ్ లో ప్రజా ఉత్సవాలు ఉంటాయని ప్రకటన చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. ప్రజా ఉత్సవాలకు కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కావాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారన్నారు. 7, 8, 9 తేదీల్లో నెక్లెస్ రోడ్ లో ఉత్సవాలు, కార్నివాల్, తెలంగాణ పిండి వంటలు ఉంటాయని తెలిపారు.

ఇతర రాష్ట్రాలు, దేశాల వారు కూడా ఈ పండుగకు రావొచ్చు అని తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరెందుకు సభకు రావడం లేదు? అని నిలదీశారు. మీరొచ్చి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి, సలహాలూ ఇవ్వండని కోరారు. ప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉండటం తెలంగాణ కు మంచిదా ? మీరు సభకు వచ్చి.. ప్రతిపక్ష బాధ్యతను నెరవేర్చండి అంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. మమ్మల్ని ఆ కుర్చీల్లో చూడటం కేసీఆర్ కు ఇష్టం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news