ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు లుక్ ఔట్ నోటీసులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే .పోలీసుల కళ్లు గప్పి తిరుగుతూనే పిన్నెల్లి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు జూన్ 5వ తేదీ వరకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5 వరకు ప్రతి రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేసి వెళ్లాలని ఆదేశించింది.
అయితే తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంపై తాను ఈసీ, రాష్ట్ర డీజీపీని కోరుతూ లేఖ రాశానని పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన హైకోర్టు .. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై కీలక అదేశాలు జారీ చేసింది.పిన్నెల్లి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. శుక్రవారంలోపు ఆర్డర్స్ ఇవ్వాలని ఈసీ, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.