కాంగ్రెస్ పాలనలో తమకు జీతాలు రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చర్లపాలెం గ్రామంలో కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని కార్మికుల ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గారు జీతాలు ఇప్పించాలని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి గోడు చెప్పుకోవడానికి వెళ్తున్న కార్మికులను పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.