టోల్ చెల్లించాలని కారును ఆపినందుకు రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ వద్ద బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, తాను ప్రభుత్వ ఉద్యోగిని అని టోల్ చెల్లించడానికి రంగారెడ్డి కలెక్టరేట్‌లో సర్వే & రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సిద్ధిఖీ నిరాకరించినట్లు తెలిసింది.
టోల్ కట్టి వెళ్లాలంటూ టోల్ సిబ్బంది అతని వాహనాన్ని ఆపేశారు.దీంతో వాహనం నుండి దిగి టోల్ సిబ్బందిని దుర్భాషలాడుతూ సిద్ధిఖీ మరియు అతని బంధువు దాడి చేసినట్లు సమాచారం. దాడికి పాల్పడిన దృశ్యాలు టోల్ సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.