రెండేండ్ల కింద పూర్తయిన డబుల్‌బెడ్ రూమ్‌లు బొమ్మలుగా మారాయని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అసహనం వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలో కార్మికుల కోసం నిర్మించిన 84 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల్లో కనీస సౌకర్యాలు కల్పించి వెంటనే పేదలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోగా డ్రాలు తీసి 20లోగా లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకపోతే, తామే ఆ ఇండ్లను పంచుతామని స్పష్టం చేశారు.
ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఖజానాలో పైసల్ లేవని, దళితు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడిందని అన్నారు. జులై లో స్టార్ట్ చేస్తాం అని చెప్పి ఇప్పటి వరకు మెదలు పెట్టలేదని, కేవలం ఎన్నికల స్టంట్ కోసం దళిత బంధు తెర మీదికి తీసుకొచ్చారని అన్నారు. ఎన్నికలు, ఓట్ల కోసం దళితులతో రాజికీయాలా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.