తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన ఎమ్మెల్యే రాజాసింగ్

-

తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు తనకి ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మత్తులకు గురి అవుతుందంటూ ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై గురువారం తెలంగాణ ఇంటిలిజెన్స్ ఐజి కి లేఖ రాశారు. కండిషన్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.

నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం అకస్మాత్తుగా ఆగిపోతుందని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు పోలీసు శాఖ దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ తిరిగి అదే వాహనాన్ని కేటాయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారని.. ఆ జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కండిషన్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకపోవడం దారుణం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version