ఉద్యోగులతో చర్చించాకే PRC ఉత్తర్వులు ఇచ్చాం – మంత్రి బొత్స

-

ఉద్యోగుల సమస్యలు ఎప్పుడూ ఉంటాయని.. అవి తీరేలా ఉంటే బాగుండేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. పిఆర్సి వల్ల ఉద్యోగులకు నష్టం జరిగిందంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేశారు. ఉద్యోగుల అంగీకారంతోనే పిఆర్సి పై ఉత్తర్వులు వచ్చాయని స్పష్టం చేశారు. 12వ పిఆర్సి వేయాలంటూ ఉద్యోగులు కోరడంలో తప్పు లేదన్నారు. ఉద్యోగులకు జీతాల రూపంలో ఏటా రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులు కొన్ని అంశాలపై కోర్టులకు వెళ్లడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఏమీ లేదని.. కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళితే ఉద్యోగులకే సమస్య అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version