ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో తిరుపతిలోని స్విమ్స్ కు ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రోజాతో కలిసి ఇన్ని రోజులు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన మొదలైంది. ఐతే తన ఆరోగ్యంపై ఆందోళన చెందల్సిన అవసరం లేదని..
కరోనా బారినపడిన తన గన్‌మెన్ సెలవులో ఉన్నాడని రోజా తెలిపారు. 18 రోజులుగా విధులుగా రావడం లేదని చెప్పారు. అయినప్పటకి రోజా తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన అధికారులు గన్‌మెన్‌కు కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు చాలామంది ప్రజాప్రతినిధులు ఈ మహమ్మారి బారిన సంగతి తెలిసిందే.