మోదీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు వలస కూలీల కు ప్రయోజనం ఇందులో ఉండేలా ఒక స్కీమ్ ను చేపట్టారు. అయితే ఇందులో పేదలు వలస కూలీలు ఉండడానికి అనుమతి ఉంటుంది కానీ వాళ్లు ప్రతి నెలా కొంత మేర డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది. అయితే పేదలకు వలస కూలీలకు ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల ప్రధాని మోదీ జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇందులో లక్ష సింగిల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా ఒకటి.
అయితే కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో పేద ప్రజలు వలస కూలీల కోసం వాళ్ళు ఇవ్వగలిగే అంత రెంట్ తీసుకుంటూ వీటిని నడిపించడం జరుగుతుంది. దీని పేరు ఆఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్. ఈ నిర్మాణం చేపట్టాలని క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదిలా ఉంటే ప్రభుత్వం వర్కర్ల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇళ్లను నిర్మించనుంది. మొత్తంగా మోదీ ప్రభుత్వం లక్షకు పైగా ఇళ్లు నిర్మాణాన్ని ఆమోదం తెలిపింది. ఇవన్నీ ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లో మరిన్ని నిర్ణయాలను తీసుకుంది మరో మూడు నెలల పాటు ఉజ్వల్ స్కీం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం కూడా జరుగుతుంది.