రాజకీయాల్లో ఏదైనా వార్తే.. ఏం జరిగినా సంచలనమే! ఇప్పుడు అధికార పార్టీ వైసీపీలోనే ఇలాంటి చర్చే సాగుతున్నది. ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్టుగా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా మరోసారి తన మనసులో మాటను తన అనుచరులతో చెప్పారట. అంతే.. అది అలా అలా పయనిం చి.. సోషల్ మీడియాకు చేరింది. దీంతో ఇప్పుడు రోజా మనసులో మాట నెరవేరేనా? ఆమె ఆశలు ఫలించే నా? అంటూ జోరుగా కథనాలు తెరమీదికి వస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే.. వైసీపీలో రోజా కీలక నాయకురాలు. గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రోజా.. అప్పటి అధికార పక్షం టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ఫైర్ బ్రాండ్‌గా దూకుడు ప్రదర్శించారు. ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీం తో రోజా.. రాజకీయంగా మంచి గుర్తింపు సాధించారు ఇక, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రెండో సారి కూ డా నగరి నుంచి విజయం సాధించిన రోజా.. పార్టీలో సెంటరాఫ్‌ది టాపిక్‌గా మారిపోయారు.
ఈ క్రమంలో నే జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఖచ్చితంగా రోజాను వరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, తన సొంత సామాజిక వర్గానికి చెందిన రోజాకు ఛాన్స్ ఇస్తే.. బ్యాడ్ సిమ్‌టమ్ పంపినట్టు అవుతుందని భావించిన జగన్ మౌనం వహించారు. ఈ క్రమంలోనే రోజాకు నామినేటెడ్ పదవిని అప్పగించారు. గుడ్డికన్నా మెల్లనయం అన్నట్టుగా.,అసలు ఏ పదవీ లేనప్పుడు.. ఏపీఐఐసీ అయినా ఒకే అంటూ.. రోజా సర్దుకు పోయారు.
మంత్రి పదవిపై ఆశలు ఉన్నా.. మరో రెండేళ్ల వరకు చాన్స్ లేకపోవడంతో మౌనం పాటించారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా రోజాకు మళ్లీ ఆశలు చిగురించాయి. దీనికి కారణం.. మండలి రద్దు నేపథ్యంలో.. కేబినెట్ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేస్తే.. ఒక బెర్త్‌ను తనకు ఖచ్చితంగా జగన్ ఇస్తారని ఆమెతోపాటు ఆమె అనుచరులు కూడా భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారట.
అయితే, మండలిని రద్దు చేస్తూ.. జగన్ తీర్మానం చేసినా.. కేంద్రం దీనినిఆమోదిస్తేనే అమల్లోకి వచ్చి మండలి రద్దవుతుంది. అప్పటి వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే తాము మండలి రద్దయ్యేవరకు కొనసాగుతామని మోపిదేవి ఇటీవల వెల్లడించారు. ఈ క్రమంలో మరి రోజా ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.