అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ ప్రగతికి చిహ్నాలు : ఎమ్మెల్యే సతీష్‌

-

ఈరోజు హుస్నాబాద్ మండలంలోని పోతారం శుభం గార్డెన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీ ప్రగతికి చిహ్నాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ తెలిపారు. పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇలాంటి సభలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అధిష్టానం పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత పటిష్ట పరిచేందుకు ప్రతినిధుల సభ నిర్వహించామన్నారు సతీష్ కుమార్.

హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేశామన్నారు ఎమ్మెల్యే సతీష్. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాజెక్టులో నీళ్లు నింపి హుస్నాబాద్ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయనున్నట్లు తెలిపారు ఆయన. ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఆరాటపడుతోందని భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమని పేర్కొన్నారు. అలాగే మతం పేరుతో బీజేపీ చౌకబారు రాజకీయాలు చేస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తుందన్నారు ఆయన. ఈ రెండు పార్టీలను కాలగర్భంలో కలిపి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని.. ఇందు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని సూచించారు ఎమ్మెల్యే సతీష్ కుమార్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version