రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పుట్ట మధు అరెస్టుతో పెద్దపల్లిలో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆయన ఇలా అరెస్టు అయ్యారో లేదో అప్పుడే జడ్పీ పీఠంపై వార్ షురూ అయింది. ఆయనను ఇంకా పదవి నుంచి తొలగించకుండానే టీఆర్ ఎస్‌లో జడ్పీ పోటీ కాకరేపుతోంది.
ఇదుకోసం పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో కూడా ఆమె జడ్పీ చైర్‌పర్సన్ పదవి కోసం పోటీ పడ్డారు. అయితే శ్రీధర్‌బాబుకు సరైన నాయకుడు పుట్టమధునే అని ఆయనకే కుర్చీ అప్పగించారు. ఇప్పుడు మళ్లీ పీఠం పోటీ ఆసక్తిరేపుతోంది.
ఇందుకోసం ఇన్‌డైరెక్ట్‌గా ఆమె తన అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు. ఇదిలా ఉంటే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా తన అనుచరులకే జడ్పీ పీఠం ఇప్పించాలని ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగా తన అనుచరుడైన బొడ్డు రవీందర్‌తో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ వీడియోలు, పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే వీటిపై సంధ్యారాణి అనుచరులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇక్కడ ట్విస్టు ఏంటంటే కోరుకంటి చందర్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు సంధ్యారాణి సపోర్టు చేసింది. కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్యనే వార్ మొదలైంది. మరి ఎవరికి పీఠం దక్కుతుందో చూడాలి.