డాక్టర్‌గా మారిన ఎమ్మెల్యే.. యువకుడుకి తప్పిన ప్రమాదం

-

గుంటూరు జిల్లా తాడికొండ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యురాలైన శ్రీదేవి తన వృత్తి ధర్మాన్ని పాటించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి… ప్రథమ చికిత్స చేశారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే గుంటూరు నుంచి పనిమీద వేరేచోటకి వెళ్తుండగా… లారీ, ద్విచక్రవాహం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కరోనా భయంతో అక్కడ ఉన్న స్థానికులు సైతం గాయపడిన వ్యక్తి వద్దకు వెళ్లే కనీస ప్రయత్నం చేయలేదు.

Undravalli sreedevi

వైద్యురాలయిన శ్రీదేవి వెంటనే తన వాహనంలో నుంచి దిగి గాయపడిన వ్యక్తి దగ్గరకు చేరుకుని నాడిని పరిశీలించారు. ప్రథమ చికిత్స అందించారు. అనంతరం దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version