అనంతబాబు రిమాండ్ పొడిగింపు.. బెయిల్‌పై సస్పెన్స్‌

-

ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యంను హత్య చేశారనే అభియోగంతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే అనంతబాబు రిమాండ్ నేటితో ముగిసిన నేపథ్యంలో ఆయనను పోలీసులు నేడు కోర్టులో హజరుపరిచారు. ఈ క్రమంలో విచారణ చేపట్టి ఎమ్మెల్సీ అనంత‌బాబుకు రిమాండ్ పొడిగిస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 20 వ‌ర‌కు అనంత‌బాబు రిమాండ్‌ను పొడిగిస్తున్న‌ట్లు కోర్టు సోమ‌వారం ప్ర‌క‌టించింది. అంతేకాకుండా అనంత‌బాబు బెయిల్ పిటిష‌న్‌పై రేపు (మంగ‌ళ‌వారం) విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపింది కోర్టు. సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తానే చంపిన‌ట్లు వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రిస్తున్న అనంత‌బాబు ఒప్పుకున్న సంగ‌తి తెలిసిందే.

దీంతో పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేయ‌గా…ఆయ‌న‌ను జ్యూడిషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో సోమ‌వారం అనంతబాబును పోలీసులు కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా… ఈ నెల 20 వ‌ర‌కు ఆయ‌న‌కు రిమాండ్ పొడిగిస్తూ న్యాయ‌మూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనంత‌బాబును పోలీసులు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version